యెహోవా నా మొఱ లాలించెను | Yehova na mora lalinchenu

యెహోవా నా మొఱ లాలించెను | Yehova na mora lalinchenu

పల్లవి: యెహోవా నా మొఱ లాలించెను - దన మహా దయను నను గణించెను

అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని - గ్రహించి మనిపెను 


1. పిశాచి గడిమి బడగొట్టెను - దన వశాన నను నిలువ బెట్టెను.
ప్రశాంత మధుర సు - విశేష వాక్ఫల - నిశాంతమున
జే - ర్చి సేదదీర్చెను.


2. మదావళము బోలు నా మదిన్ - దన ప్రదీప్త వాక్యాం కుశా
హన్ = యధేచ్ఛలన్నిటి గురించి పాపపు - మొదల్ తుదల్
నరి - కి దరికి జేర్చెను


3. అనీతి వస్త్ర మెడలించెను - యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే - ద నూని యెన్నడు - గనన్
వినన్ బ్రే - మ నాకు జూపెను


4. విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు
సెలవిచ్చెను = శిలానగముపై - కి లాగి నను
సుఖ కభావళుల్ మన సున నిలిపెను


5. అగణ్య పాపియని త్రోయక - నన్ను గూర్చి తన సుతుని
దాచక = తెగించి మృతి కొప్పగించి పాపపు - నెగుల్
దిగుల్ సొగ - సుగా నణంచెను


0/Post a Comment/Comments

Previous Post Next Post