ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం | Ye patidho na jeevitham

  ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం | Ye patidho na jeevitham

పల్లవి: ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం 
ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించినా - నాకై మరణించినా
నన్ను విడిపించినా యేసుకే... (2)
ప్రభుయేసు నీకే స్వాగతం - మారిపోయేగా ఆ నా గతం (2)


1. ఎందుకో పుట్టానని - నా బ్రతుకే దండగని
పనికిరాని వాడనని - పైకి అసలే రాలేనని (2)
పదిమంది ననుచూసి గేళి చేయువేళ...
పనికొచ్చే పాత్రగా నను చేసినా - పరిశుద్ధునిగా నను మార్చినా
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2)


2. అందచందాలు లేవని - చదువు సంధ్యలే అబ్బని
తెలివి తక్కువ వాడనని - లోక జ్ఞానమే లేదని (2)
పదిమంది నను చూసి గేళి చేయువేళ....
పరిశుద్ధాత్మతో నను నింపినా - సిలువ సాక్షిగా నను మార్చినా
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2)

1/Post a Comment/Comments

Post a Comment

Previous Post Next Post