ఎంత మధురమో యేసుని ప్రేమా | Entha Madhuramo Yesuni Prema


పల్లవి: ఎంత మధురమో యేసుని ప్రేమా 

ఎంత మధురమో నా యేసుని ప్రేమ 

ప్రేమా... ప్రేమా... ప్రేమా... ప్రేమా.


1. అంధకార బంధము నన్నావరింపగా 

అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని

బంధము తెంచెను - బ్రతికించెను నన్ను


2. రక్షించువారు లేక పక్షినైతిని

భక్షకుడు బాణము గురి పెట్టి యుండెను 

బంధము తెంచెను - బ్రతికించెను నన్ను


3. ఎన్నో పాపములు చేసి మూటకడితిని 

ఎన్నో మోసములు చేసి దోషినైతిని 

బంధము తెంచెను - బ్రతికించెను నన్ను


4. కుష్టు బ్రతుకుతో నేను కృంగి యుండగా 

భ్రష్టుడైన నన్ను బ్రతికించితివి 

బంధము తెంచెను - బ్రతికించెను నన్ను

0/Post a Comment/Comments

Previous Post Next Post