రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు | Ruchi chuchi yerigithini Yehova Vutthamudaniyu

రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు | Ruchi chuchi yerigithini Yehova Vutthamudaniyu

పల్లవి: రుచి చూచి యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని


1. గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు - దయాళుడవు నీవే


2. మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా
మనసార పొగడెదను - నీ ఆశ్చర్య కార్యములన్


3. మంచితనము గలదేవా - అతి శ్రేష్టుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు


4. నా జీవిత మంతయును - యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో - నా దేవుని కీర్తింతున్


5. సంతోషింతు నెల్లప్పుడు - కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మది నిచ్చు - నా రక్షకుడు యేసు


6. ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను - అడుగు వాటన్నిటిని


7. కృతజ్ఞత చెల్లింతు - ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను





0/Post a Comment/Comments

Previous Post Next Post